Sunday, October 29, 2017

For those who see Shiva in downtrodden ,diseased and poor !!!!

లహరి సిస్టర్... నిజం గా మాటలు రావడం లేదు...వైష్ణవి పాప విషయం లో కానీ ..ఇప్పుడు చేస్తున 365 రోజుల అన్న దాన సంకల్పం కానీ....హైదరాబాద్ స్టేషన్ లో చూపిన అపరిమిత మైన మానవత్వం కానీ ..i.e.extreme humanity or compassion to fellow human being .... విశ్వ మాత ...మదర్ తెరెసా or Swamji I.e.Swami Vivekananda నిజమైన శివారాధన అంటే ఏమిటో చెప్పిన మాటలు గుర్తుకు తెస్తునాయి..."This is the gist of all worship — to be pure and to do good to others. He who sees Shiva in the poor, in the weak, and in the diseased, really worships Shiva; and if he sees Shiva only in the image, his worship is but preliminary." మాటలు చెప్పడం ఎవరు అయిన చేస్తారు ...కానీ చేతల లో చేయగలవారు కొందరే #OYChallenge start చేసి ...మన అందరిని చైతన్య పరిచి...ప్రతి ఒక్కరి లోని మానవత్వాని , గొప్పతనాని ...నిదుర లేపుతున్న ..Sridhar Nallamothu గారికి , నీకు hats off... ఈ యజ్ఞం ఇలాగె కొనసాగాలి అని ...రానున్న రోజుల్లో...మనమంతా...బలమైన వ్యక్తులగా ...ఎదిగి ..ఈ సమాజానికి మరింత మంచి చేయాలి...మనసారా కోరు కుంటునాన్ను - Sridhar Danduboyina . 

About Lahari Manasa & And Her compassion in Sridhar Nalla Mothu Gari Words

లహరి మాటలు చదివితే మనపై మనకు సిగ్గేస్తుంది..
లహరి ఐదు రోజులుగా చెన్నైలో వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 25 మంది వేర్వేరు ముసలి వాళ్లని వెదికి పట్టుకుని ఆహారం ఇస్తోంది. తను అనుభవాలు చదువుతుంటే కళ్లు చెమర్చుతాయి. #OYChallengeలో ఓ ఉన్నతమైన ప్రాజెక్ట్ ఇది.
చాలామంది పెద్దవాళ్లు అడుక్కోవడానికి ఓపిక లేక దూరంగా చెట్ల దగ్గర కూర్చుంటున్నారు ఎండకి తట్టుకోలేక.
అన్నం తీసుకు వెళ్తుంటే ఆకలికి తట్టుకోలేక ఈరోజుకి కడుపు నిండిపోయింది అన్నంత సంతోషంగా లాక్కుంటున్నారు.
చెన్నైలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. 3rd డే ఏమైందంటే. అన్నం ఇస్తుంటే తాగడానికి నీళ్లు కష్టమవుతుందమ్మా నీళ్లు కావాలి అని అడుగుతున్నారు. పక్షులకి నీళ్లు కావాలి అని గొప్ప మానవత్వం చాటే మన జనాలు ఇలా రోడ్ల మీద ఉండే పెద్ద వాళ్ల గురించి ఎవరూ ఆలోచించట్లేదు. నీళ్లు కూడా దొరకని పరిస్థితిలో తినలేకపోతున్నారు. మూడవ రోజు నుండి వాటర్ పాకెట్లు తీసుకు వెళ్లోంది. వాళ్లు తినడంతో పాటు మిట్ట మధ్యాహ్నం తిరుగుతున్నావన్నా నువ్వు తిన్నావా అని మరీ అడుగుతున్నారు.
ఈరోజు చెత్తకుప్పల దగ్గర కుక్కంతా డర్టీ చేసింది. అక్కడే ఒకాయన కూర్చున్నారు. ఆయన్ని పక్కకొచ్చి కూర్చోమంటే పక్కకొస్తే తిడుతున్నారమ్మా అన్నారు.అక్కడో షాప్ ఉందట. ఎవరూ తిట్టరు నేను చెప్తాను అని పక్కకు తీసుకెళ్లి కూర్చోపెట్టింది లహరి.
ఇంకొకాయన వీల్ ఛెయిర్ మీద కూర్చున్నారు. వాళ్లకి ఇస్తుంటే "అమ్మా ఈరోజుకి అన్నం లేదనుకుంటే దేవుడు పంపించినట్లు తీసుకు వచ్చావమ్మా" అని కళ్లమ్మట నీళ్లు పెట్టుకుంటున్నారు.
వీళ్లందరికీ పిల్లలు ఉంటారు కదా.. 60-65 ఏళ్లు ఉంటాయి. అస్సలు వాళ్ల పిల్లలేం చేస్తున్నారు. కొంతమంది లేచి అడుక్కునే స్థితిలో కూడా లేరు. లహరి ఒకరోజు వెళ్లిన ఏరియాకి మరోరోజు వెళ్లడం లేదు. 5 రోజుల్లో 25 మంది కొత్త వాళ్లకి ఫుడ్ ఇచ్చింది.
అన్నం చూడగానే అమృతం చూసినట్లు ఫీలవుతున్నారు. వాళ్లు ఎమోషనల్‌గా బ్లెస్ చేస్తున్నారు. వీళ్లు మనుషులే కదా వీళ్లని జనాలు కనీసం మనుషుల్లా కూడా ఎందుకు జనాలు చూడట్లేదు అని బాధపడుతోంది లహరి. ఈ #OYChallenge లో భాగంగా ఎవరూ ఒక్క ముద్ద కూడా వేస్ట్ చెయ్యకుండా చూస్తే బాగుణ్ణు. ఎందుకంటే జనాలు చెత్తకుప్పల్లో అన్నం పడేస్తుంటే వృద్ధులు ఆ చెత్త కుప్పల్లో ఏరుకుంటున్నారు. అన్నం తీసుకున్న వెంటనే అంత పెద్ద వాళ్లు నేను చిన్నపిల్లనని కూడా చూడకుండా నమస్కారం పెడుతున్నారు, అది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటోంది.
ఒక తాత ఓ మురికి కాలవ దగ్గరకు కూర్చున్నారు. వాళ్ల దగ్గరకు ఎవరూ వెళ్లడం లేదు. చివరకు ఎవరూ భిక్షం వెయ్యడానికి కూడా వాళ్ల దగ్గరకు రావట్లేదు. భిక్షం ఎవరికి వేస్తున్నారంటే అడుక్కునే వాళ్ల దగ్గరకు వెళ్తున్నారు గానీ దూరంగా కూర్చున్న ఆ ముసలి వాళ్ల దగ్గరకు వెళ్లడం లేదు. ఆ తాత తాను ఇందాక కొద్దిగా తిన్నాను నాకు వద్దమ్మా కాస్త దూరంలో ఇంకొకాయన ఉన్నారు. ఆయన రెండు రోజులు నుండి తినలేదు ఆయనకి ఇవ్వమ్మా అని మరీ శాక్రిఫైజ్ చేశారు.
లహరి వాళ్లింట్లో నిన్న పిజ్జా తెస్తామన్నారు. తను ఈ ఐదు రోజులు చూసిన తర్వాత ఆఫ్టరాల్ అంత ఖర్చుపెట్టడం ఇష్టం లేక అదే అమౌంట్‌తో కొంతమంది ఆకలి తీరుతుందని ఇకపై నాకు ఇలాంటివి తీసుకు రావద్దని ఇంట్లో చెప్పింది.
- నల్లమోతు శ్రీధర్

Very few people are with this extreme compassion and seeing Shiva in the poor, in the weak, and in the diseased. With #OYChallenge want to hear more such stories and all the best for those who are willing to do more good to society and themselves.

Friday, May 9, 2014

మాతృదేవోభవ !!!!

తన ఒడినే బడి చేసి మనకు మాటలు నేర్పే "తొలి గురువు" అమ్మ
నవ మాసాలు మోసి , తన రక్తని పంచి , పురిటి నెప్పులు జయించి 
ఇస్తుంది ....... మనకీ జన్మ 
అందుకే అమ్మ ఋణం..... మన మెవరం ..జన్మ జన్మలకు తీర్చుకోలేనిది !!!

జీవితం లో.... మరువ లేనిదీ అమ్మ లాలి పాట తియ్యదనం ,
అమ్మ పెట్టిన గోరు ముద్దల కమ్మదనం
కంటి పాపను కను రెప్ప కాపాడినట్లుగా....
సుస్థి చేసినపుడు....అమ్మ చూపించే ఆ అమ్మ తనం .
అందుకే అమ్మా.... నీకు వందనం....ఏమి ఇచ్చి తీర్చుకోను నీ ఋణం .

చిన్న దెబ్బ తగిలినా.... నా నోట వచ్చు పదం నువ్వే " అమ్మా "
అక్షరాలు నేరుచుకున్నపుడు నేను రాసిన తొలి పదం నువ్వే "అమ్మా "
భగవంతునికి కూడా ప్రతి రూపం ఉంది అంటే అది నువ్వే " అమ్మా "

అందుకే అమ్మ ఋణం.....జన్మ జన్మలకు తీర్చుకోలేనిది !!!
మనషులు అయిన జీవులయిన ....లోకం లో అమ్మ అనే
స్థానం ఎంతో ప్రత్యేక మైనది .

శ్రీ తపన 

Thursday, April 24, 2014

Road Accidents in India ????

ప్రమాదాలను మనం ఎందుకు తీవ్రంగా  తీసుకోవడం లేదు ??? రోజు రాష్ట్రంలో , దేశం లో రోడ్ ప్రమాధాల్లో  ఎంతో మంది అమాయుకులు చని పోతున్నారు . ఎంతో మంది జీవితాలు తల్ల కిందులు  అవుతున్నాయి . ఈ దేశ అత్త్యునత న్యాయ స్థానం సుప్రీమ్ కోర్టే రెండు రోజులు క్రితం ఈ విషయం చెప్పింది . నిజమే ప్రమాదాలు జరగుతాయి ,వాటిని మనం ఆపలేం . కానీ బారత దేశం లో జరుగుతున్న ప్రమధాలో తొంబయి శాతం మానవ తప్పిదాలే , నిరలక్ష్యపు వ్యవస్థ , అడుగడునా అవినీతి , విలువలు మరిచిన సమాజపు పరివ్యసనాలే.

ఈ ప్రపంచంలో అన్నిటి కన్నా విలువయినది మనిషి ప్రాణం . ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న డబ్బునంత తీసుకుని వచ్చి ఇచ్చినా పోయిన ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకు రాలేం.

అతి వేగం , సరి అయిన రోడ్లు , మద్యం సేవించి వాహనం నడపడం , రోడ్ నియమాలు పాటించకపోవడం , బద్రత ప్రమాణాలు గాలి కోదిలేయడం ...ఇలా ప్రమాదాలకు కొన్ని
ముఖ్య కారణాలు అని అందరికి తెలిసినా . మనం ఈ విషయాని  తేలిక గా తీసుకుంటాము.
రోడ్ ప్రమాదాలు తగ్గేన్చెందుకు పోరాడుతున్న వాళ్ళని పిచ్చోళ్ళు గా చూస్తాము.

కనీసం  మనలో ఏ మాత్రం చైతన్యం మిగిలి ఉన్న.... ఒక తల్లికి బిడ్డని , ఒక బిడ్డకి తండ్రి ని , ఒక బార్యకు బర్త ని , ఒక అన్నకు చెల్లిని , లేక ప్రజల నుంచి ఒక మంచి నాయకుని .జీవిత బంధాని  దూరం చేసి తీసుకుపొత్తున ...ఈ రోడ్ ప్రమాదాలు , బస్సు ప్రమాదాలు  నివారించడం , బద్రత గురించి ఆలోచిద్దాం.

మీ ఆలోచనలూ  పంచుకొండి.

శ్రీ తపన

Tuesday, July 30, 2013

తెలుగుతల్లి....ఆత్మగోష !!!!

తెలుగుతల్లి....ఆత్మగోష !!!!

తెలుగు తల్లి... కన్నీరు ఎంధుకమ్మ ?

మా తెలుగు తల్లి కి..మల్లె పూదండ అని పాడిన నీ బిడ్డలు...
ఇక ఆ దండని.... నీకు ముక్కలు చేసి వేస్తారన......
లేక నిన్నే ముక్కలు చేయాలని చూస్తునారన.....

నాకు తెలిసి
కలిసి ఉండాలని ఒకరు...విడిపోవాలి అని ఇంకొకరు ....తన బిడ్డలు ..
ఎప్పుడు కొట్టుకుంటుంటే....ఏ తల్లికి మాత్రం బాధ ఉండదు ???

అయినా...నీ బాధ... నీ గురించి కాధులే...మా గురించే కధా !!!!

కొన్ని గుంట నక్కలు ....తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కోసం...
నీ బిడ్డల ప్రాంతాలు...మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టి.... ఉధ్యమం పేరుతో ...అమాయక విధ్యార్థులు
ఆత్మ బలి దానాలు చేసుకునేలా పురిగొల్పి....చరిత్ర ను వక్రీకరిస్తూ....నువ్వు ముక్కలు
అయితేనే వారి విజయం , అభివ్రుధి అనే బ్రమ లోకి  నెట్టి వేసి...ఎప్పటికీ చల్లారని చిచ్చు పెడితే .....

 ఆ మంటలు చల్లరాలని....నీ బిడ్డలు అందరు బాగుండాలి అని ...ఎంధూకమ్మ కోరుకుంటూనావు ?

పొరుగు రాష్ట్రాల్ వారి ధగ్గర నీ బిడ్డలు చిన్న వారు అవుతారు అన....లేక ఇక నుంచి చీటికి మాటికీ ....
నీటికి , బూటీకీ కొట్టుకుంటూ.... వేరే వారిని తగువు తేర్చమాంతారు అనా ?

బ్రస్తు పట్టిన ఈ దేశ ప్రజాస్యామ్య వ్యవస్తలో .....నీ బిడ్డల మధ్య గొడవని...అవకాశం గా తీసుకునే వారే తప్ప....
నీ ఆత్మ గోష ను ... అర్థం చేసుకో లేరెవరు !!!!

నీ ఆఖంక్ష తో పని లేకుండానే...నీ  బిడ్డలు విడిపోవాలి అన్న నిర్ణ్యయము...హాస్తీన పెద్ధల సాక్షి గా జర్గీపొయింధీ....

ముక్కలు అయ్యింది నువ్వు కాధు...నీ హృదయం.... అని నాకు ....అర్థం అవుతుంధీ !!!!

జై తెలుగు తల్లి !!!!

ఇక సెలవు

శ్రీ తపన



Note: I am not anti about telangana or support for telangana.... but worrying how worst these politicians and political parties playing with people emotions and sentiments.... finally sufferer is common man only....what i believe is... all it's just part of political game...divide and rule !!!!








Wednesday, January 2, 2013

My IDEA's for Nokia Your Wish Is My App Contest


Hi Friend ,
                      Please spend a two minutes of your time and give your
Vote for following mobile application ideas.
i.e. Open the below links and click on the facebook Like button and Radio
button below the idea description.

Caution : You need to login into your facebook account and need to click 
on the Like Button.
Note : All ideas are given by keeping social cause and significance in mind.

Need your votes for shortlisting
Please do the needful.
Thank you.
Best Regards,
Sridhar Danduboyina

Saturday, January 15, 2011

Real Sankranthi..... !!!!!

ప్రియమైన మిత్రులారా ,

గుండె లోతులో నుంచి గుర్తు తెచ్చుకుందామా....
ఆ నాటి మన సంక్రాంతి సంతోషాలు
తెల తెల్ల వారు జామున కుర్రతనం జోరులో
వేసిన బోగి మంటల వెచ్చని జ్ఞాపకాలు !!!!

ముద్దు గుమ్మాలు .... ముంగిట వేసిన ముద్దోచే రంగుల..... ముగ్గులో గొబ్బియలు
డూ డూ బసవన్న చే గంగి రెడ్దుల చెప్పించే ..అమ్మ వారికీ , అయ్యా వారికీ ..జే జే లు

చేతికొచ్చిన పంటల దాన్యలతో సిరి సౌబాగ్యలు....
ఇంటికి వచ్చిన అల్లులు కు అందే మర్యాదలు
వంటింటిలో అరిసెలు , అటక ఫై సున్నుండలు , జేబులో జంతికలు ....తిన లెన్నని పిండివంటలు.

చాటు మాటున పెద్దలు వేసే కోడి పందాలు .....ఆకాశానికి పోటిగా పిల్లల వేసే గాలి పటాలు
హరిదాసుల గానాలు ....అడిగిన ప్రతి వారికీ... లేదనకుండా దక్కేను అన్న పానీయాలు

ఇలా ఎన్నని చెప్పిన ఆనందం తరుగని .....ఆ నాటి సంబరాల సంక్రాతి ....
కానీ...... నేడు లేదు...ఈ పండుగ రోజున .... రైతు మోములో కాంతి.

ఎందుకంటే

పల్లెటులే దేశానికి పట్టు కొమ్మలు అన్న బాపూజీ..... కలలు కన్నమన స్వరాజ్యం
టూ జి , త్రి జి అంటూ లెక్క లెన్నని కుంబ కోణాలకు ....
అవినీతి అక్రమాలకు అయితే సామ్రాజ్యం.

ప్రకృతి వైపరిత్యాలు , నకిలీ విత్తనాలు , రాజకీయ నాయకుల వాగ్దానాలు
అడుగడుగునా అన్న దాతను మోసం చేస్తూ క్రుంగ దీస్తూ ఉంటె ..
.
మట్టిని నమ్మిన రైతన ...బరువెక్కిన గుండెతో ...
అందరి నేరానికి తను ఉరి కంబం ఎక్కలిసివస్తుంది.

ఓ రైతన్న

ప్రతి రోజు వార్త పత్రికలో , టి వి చానలో వినిపించే నీ మరణ వార్త ...
ఈ జనానికి అలవాటు అయిపోయింది .
కానీ వెయ్యి కోట్లకు అధిపతి అయిన ...నీవు పండించే గింజ తినే బతకాలి అన్న సత్యం
మరిచిన వాళ్ళకి ....తినడానికి అన్నం దొరకని రోజున నీ విలువ తెలిసి వస్తుంది.
పరిస్థితి ఇలాగె కొనసాగితే .........నాకు తెలిసి అప్పటికి నీవు ఉండవు అని పిస్తుంది .

."జై కిసాన్ "అన్న లాల్ బహుదూర్ శాస్త్రి గారి ఆత్మ సాక్షి గ ...
నీ కోసం మా మనసు ఏదో చేయాలి అని తపిస్తుంది.

మేము సంక్రాతి పండు గ తిరిగి చేసుకో లేక పోయిన పర్లేదు ...
కానీ నీ జేవితం లో అశాంతి పోయి ...నీ మోమున కాంతి చూడాలి

అదే మా కందరికీ నిజమయిన సంక్రాతి !!!!!

తపనతో ,
శ్రీ తపన


కల్మషం ఎరుగని మనుషులకు , నీతి నిజయితలకు ప్రతికలు ..పల్లెటూలు....
ఆ పల్లెటూలు కు ....అన్నదాత రైతన్న కు ఈ నా కవిత అంకితం

Monday, May 10, 2010

Flowers have an expression ...!!!!



Flowers have an expression of countenance as much as men or animals. Some seem to smile; some have a sad expression; some are pensive and diffident; others again are plain, honest and upright....